: రేపు సాయంత్రం జీవోఎం భేటీ


రేపు సాయంత్రం 5 గంటలకు జీవోఎం భేటీ కానుంది. ఈ భేటీతో రాష్ట్ర విభజన అంశం ఓ కొలిక్కి వస్తుంది. కాగా జీవోఎం భేటీ ముగిసిన తరువాత ఈ నెల 4 న కేబినెట్ భేటీ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే కేబినెట్ భేటీపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని జీవోఎం భావిస్తుండగా, కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. కాగా పార్టీ అధిష్ఠానం మాత్రం శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే రాయల తెలంగాణ అంశం చర్చకు రాలేదని దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తమ పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశాల వివరాలను బహిర్గతం చేయలేమని కూడా నేతలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News