: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం
నిన్న రాత్రి 11.35 గంటలకు ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం సంభవించింది. దాదాపు 3 సెకన్ల పాటు కర్ణకఠోరమైన శబ్దంతో భూమి కంపించింది. దీంతో, అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న ఒంగోలు వాసులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనన్న భయంతో నిద్రలేని రాత్రిని గడిపారు. అయితే, ఈ కంపనాలు ప్రమాదకరమైనవి కావని... ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.