: పాతబస్తీలో కిడ్నాప్ కలకలం


హైదరాబాదులోని పాతబస్తీలో కిడ్నాప్ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. గత రాత్రి పాతబస్తీలో ఓ యువకుడ్ని పోలీసుల మంటూ అపహరించుకుపోవడం కలకలం రేపుతోంది. కార్వాన్ కి చెందిన ఆటో డ్రైవర్ కరీముల్లా మూడవ కుమారుడు సయ్యద్ అక్బరుల్లా గత రాత్రి స్నేహితుడితో కలిసి షాగౌస్ హోటల్ కు వెళ్తున్నాడు. దారిలో ముగ్గురు వ్యక్తులతో స్వల్పవివాదం తలెత్తి కొట్టుకునే వరకు వెళ్లింది. తరువాత హోటల్ కు వెళ్లిన అక్బరుల్లాను ఇద్దరు వ్యక్తులు పోలీసులమని చెప్పి బైక్ ఎక్కించుకుని వెళ్లిపోయారని అక్బరుల్లా స్నేహితుడు తెలిపాడు. అక్బరుల్లా కిడ్నాప్ పై అతని తల్లిదండ్రులు షాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్బరుల్లాతో గొడవ పడిన ముగ్గురిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News