: మా పని పూర్తైంది.. త్వరలో పార్లమెంటు ముందుకు టీ బిల్లు: షిండే


జీవోఎం తన పని దాదాపు పూర్తి చేసిందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు. ముందుగా తెలంగాణ బిల్లు నివేదికను న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. న్యాయశాఖ నుంచి రాగానే బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే వెల్లడించారు. తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News