: ఆ పాటల రచయితలు, సినీ దర్శకులు అవినీతిపరులే: లక్ష్మీనారాయణ
సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, లంచగొండితనంపై అన్ని వర్గాలు కలసి పోరాడాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ప్రకాశ్ విద్యానికేతన్ లో నిర్వహించిన 21వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలోని వ్యక్తులు ఎలా సంపాదించామన్నది కాకుండా ఎంత సంపాదించామన్న దానిపై దృష్టి పెడుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపిన ఆయన, డబ్బుల కోసం అశ్లీలమైన పాటలు రాసే రచయితలు, సినీ దర్శకులు సైతం తమ దృష్టిలో అవినీతి పరులేనని అన్నారు.