: కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే నేనూ చేస్తా: అశోక్ బాబు
సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదవులకు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామాకు సిద్ధమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సవాలు విసిరారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తనను రాజీనామా అడిగే హక్కు చిరంజీవికి లేదని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం నేతలను కలిసిన సందర్భంగా తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే వ్యతిరేకించాలని వారిని కోరారు.