: ఐసీసీ టెస్ట్ ర్యాంకులలో రెండో స్థానంలో భారత్.. ఆల్ రౌండర్లలో అశ్వినే టాప్
ఐసీసీ టెస్ట్ ర్యాంకులలో భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా కంటే 12 పాయింట్లు వెనుకబడి ఉంది. ఈ రెండు జట్ల మధ్య డిసెంబర్ 5 నుంచి రెండు టెస్టులు, వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక్కడ ఘన విజయం సాధిస్తే భారత్ అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. చటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ ఉత్తమ బ్యాట్స్ మెన్ గా, అశ్విన్, ప్రాగ్యాన్ ఓజా ఉత్తమ బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్లలో అశ్విన్ తొలి స్థానంలో ఉన్నాడు.