: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు పటిష్ఠ భద్రత: సీపీ అనురాగ్ శర్మ
ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నరాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు
పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాదు పోలీసు కమిషనర్ అనురాగ్
శర్మ తెలిపారు. ఇందుకోసం పోలీసు సిబ్బందిని పెంచుతున్నట్లు చెప్పారు. మరింత నిఘాలో భాగంగా అసెంబ్లీ ప్రాంతంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని సీపీ వెల్లడించారు.
నగరంలో పేలుళ్ల నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఛాంబర్ లో పోలీస్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కమిషనర్ పలు అంశాలపై చర్చించారు. అసెంభ్లీ వద్ద గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని స్పీకర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
నగరంలో పేలుళ్ల నేపథ్యంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఛాంబర్ లో పోలీస్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు