: అహోబిలం నరసింహ స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు
కర్నూలు జిల్లా అహోబిలంలో నరసింహ స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి నవ నారసింహులను దర్శించుకున్నారు. ప్రహ్లాద వరదస్వామి సన్నిధిలో సుదర్శన హోమం నిర్వహించారు. భక్తులు స్వామి వారి రక్షాబంధనం ధరించి హోమంలో పాల్గొన్నారు. అనంతరం 108 కలశాలతో స్వామి వారికి అభిషేకం చేశారు.