: ముందూవెనకా ఆలోచించి మాట్లాడాలి: బొత్సపై మండిపడ్డ లగడపాటి
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విరుచుకుపడ్డారు. పార్టీలోని వారిని సస్పెండ్ చేస్తూ పోతే, కాంగ్రెస్ లో ఎవరూ మిగలరని అన్నారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవడం తప్పని అనడం తప్పా? అని ప్రశ్నించారు. మాట్లాడేముందు బొత్స ముందూవెనక ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి సీఎం వరకు అందరూ సీడబ్ల్యూసీ తీర్మానంపై వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు.