: ఉద్రిక్తతకు దారితీసిన తెదేపా, వామపక్షాల ఆందోళన
కృష్ణా జలాల హక్కులపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, గుంటూరులో తెదేపా, వామపక్షాలు చేపట్టిన ఆందోళన చివరకు ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనలో భాగంగా, జడ్పీ కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైతు సంఘం నేత రావుల అంజయ్య, సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు పలువురు తెదేపా నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.