: మోడీకి చిదంబరం లేఖ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. రాజస్థాన్ లోని జైపూర్ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం పెరగడానికి బంగారం కొనడమే కారణమంటూ చిదంబరం చెప్పడాన్ని విమర్శించారు. దీంతో మోడీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనకు చిదంబరం ఒక లేఖ రాశారు. 'చరిత్రపై పాఠాల తర్వాత నరేంద్రమోడీ అర్థశాస్త్రంపై తొలిసారిగా పాఠం చెప్పారు. బంగారం కొనడం వల్ల ద్రవ్యోల్బణం పెరగదని, అదంతా అవినీతి వల్లేనని నాకు తెలుసు' అని పేర్కొన్నారు. బంగారం కొనడం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి కరెంటు ఖాతా లోటు పెరుగుతుందనే తాను చెప్పినట్లుగా స్పష్టం చేశారు.