: 'తెహల్కా' ఎడిటర్ బెయిల్ పై గోవా సెషన్స్ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై గోవా సెషన్స్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా.. తేజ్ పాల్ ఎక్కడికీ వెళ్లరని, కావాలంటే ఆయన పాస్ పోర్టు ను సమర్పిస్తారని తేజ్ పాల్ లాయర్ కోర్టుకు తెలిపారు. అంతవరకు అరెస్టును ఆపాలని, అరెస్టు చేయడం అనేది కేసులో చివరి ప్రక్రియ అని విజ్ఞప్తి చేశారు. విచారణకు తేజ్ పాల్ పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. ప్రస్తుతం డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపిస్తున్నారు.