: రేషన్ వస్తువులపై సీఎం ఫొటోలా.. సిగ్గుచేటు: మంత్రి డీఎల్
ప్రజలకు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసరాల ప్యాకెట్లపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫొటోలు ఉండడం సిగ్గుచేటని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లాకు ఎమ్మెల్సీ స్థానం లభించేది అనుమానమేనని డీఎల్ అన్నారు. పార్టీలో కష్టించి పనిచేసే వారికి ముఖ్యమంత్రి అనుగ్రహం దక్కడంలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.