: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ ఖాతాదారులకు సరికొత్త ఆరోగ్య బీమా పథకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ (ఎస్.బి.టి) ఖాతాదారుల కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ను ప్రారంభించినట్లు ఎస్.బి.టి, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించాయి. 35 నుంచి 65 మధ్య వయస్సున్న ఖాతాదారుల కోసం ఈ పాలసీ ఆఫర్ చేస్తున్నామని, ఈ పాలసీ కింద సంవత్సరానికి 1,300 రూపాయలు చెల్లించడం ద్వారా లక్ష రూపాయల వరకు మెడికల్ కవరేజ్ ని అందుకోవచ్చునని సంస్థ తెలిపింది. పాలసీదారులకు దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3 వేలకు పైగా నెట్ వర్క్ హాస్పిటల్స్ లో నగదు రహిత వైద్య సేవలను అందించనున్నట్లు ఎస్.బి.టి, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ పేర్కొంది.