: కృష్ణా జలాల పంపిణీపై న్యాయవాదులు సమర్థంగా వాదించలేదు: కిషన్ రెడ్డి
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభ్యుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ట్రైబ్యునల్ తీర్పుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమర్థవంతంగా వాదనలు వినిపించలేదని విమర్శించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.