: జైత్ర యాత్రలు మాని దండయాత్రలు చేయాలి: కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైత్రయాత్రలు మాని ఆంక్షలు లేని తెలంగాణ కోసం దండయాత్రలు చేయాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ సూచించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసి నాలుగేళ్లయిన సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన రక్తదాన శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ, ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ దే నని అన్నారు.