: యూటీ ప్రతిపాదన అవగాహన రాహిత్యం: అశోక్ బాబు


విభజనను అడ్డుకోలేకపోతున్న రాష్ట్ర నేతలు కనీసం హైదరాబాదునైనా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటూ కేంద్రం వద్ద చేస్తున్న ప్రతిపాదనలను ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాదు యూటీ ప్రతిపాదన అవగాహన రాహిత్యమని అన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందే అవకాశమే లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎంపీల వైఫల్యం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

  • Loading...

More Telugu News