: బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ సమీక్ష
హైదరాబాద్ పేలుళ్ల ఘటన ప్రభావం మరికొద్ది రోజుల్లో మొదలవనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైనా పడింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. అసెంబ్లీ పరిసరాల్లో పటిష్ట భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు, ఇంటలిజెన్స్, ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.