: సోనియాతో సమావేశమైన కిరణ్, బొత్స
రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై అధినేత్రి సమక్షంలో తుది కసరత్తులు చేస్తున్నారు. భేటీ అనంతరం సోనియా ఆమోద ముద్రవేసిన అభ్యర్ధుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ఏపీ భవన్, సోనియా నివాసం టెన్ జన్ పథ్ వద్ద ఎమ్మెల్సీ ఆశావహులు బారులు తీరారు.