: ఈ కెమెరా కాస్త వెరైటీది


మామూలు కెమెరాల లాగా కాకుండా కాంతి వేగం ఆధారంగా పనిచేసే బుల్లి కెమెరాను పరిశోధకులు తయారుచేశారు. దూరంగా ఉన్న వస్తువుపై కాంతిని ప్రసరింపజేసి అది ఎంత దూరంలో ఉందో కనుక్కునే సిద్ధాంతం ఆధారంగా తాము తయారుచేసిన త్రీడీ కెమెరా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు కాంతి వేగం ఆధారంగా పనిచేసే ఒక త్రీడీ కెమెరాను తయారుచేశారు. ఈ కెమెరాతో పారదర్శకంగా ఉన్న వస్తువులతోబాటు, పారదర్శకంగా లేని వాటిని కూడా చిత్రించవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న భారత సంతతికి చెందిన ఎమ్‌ఐటీ విద్యార్ధి అచుతా కాదంబి చెబుతున్నారు. దీని తయారీలో తక్కువ ఖరీదు ఉంటే షెల్ప్‌ లైట్‌`ఎమిటింగ్‌ డయోడ్లను వాడడం వల్ల ఈ కెమెరా ఖరీదు కూడా తక్కువగానే ఉంటుందని ఆమె చెబుతున్నారు.

  • Loading...

More Telugu News