: బీజేపీ పాలన అవినీతిమయం: రాహుల్ గాంధీ


బీజేపీ పాలన అవినీతిమయమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ కంటే బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. అవినీతిని అనుసరించడంలో బీజేపీ ముందుంటుందనీ, అందుకు ఉదాహరణ ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో పాలనేనని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ గిరిజన చట్టాన్ని తీసుకొచ్చిందని, ఇది రాజస్థాన్ లో అమలులో ఉందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ గిరిజనులకు భూములపై ఇప్పటికీ హక్కులివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలనను బేరీజు వేసుకోవాలని ఓటర్లకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాహుల్ కోరారు.

  • Loading...

More Telugu News