: విభజన బిల్లును అడ్డుకుంటాం: గాలి
రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకుంటామని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలంతా రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేస్తారని తెలిపారు. విభజనపై దేశవ్యాప్తంగా సుదీర్ఘ చర్చ జరగాలని, తరువాత రెండు ప్రాంతాల ప్రజలను ఒప్పించిన తరువాతే విభజన చేపట్టాలని ఆయన సూచించారు.