: జీవోఎం పనితీరు 'అసమర్థుని తీర్థయాత్ర'లా ఉంది: సీపీఐ నారాయణ
రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం పనితీరు 'అసమర్థుని తీర్థయాత్ర'లా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపించలేని జీవోఎం పదేపదే సమావేశాలు నిర్వహిస్తోందని... దీంతో పాలనలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నదీ జలాల వినియోగానికి శాశ్వత ప్రాతిపదికన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.