: 18 ఏళ్ల మహిళా క్రికెటర్ పై అత్యాచారయత్నం


మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అల్పేష్ షా తనపై లైంగిక దాడికి యత్నించాడని ఓ 18 ఏళ్ల మహిళా క్రికెటర్ ఆరోపించింది. అంతే కాకుండా జరిగిన ఘటన గురించి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) ప్రెసిడెంట్ జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాసింది. సెప్టెంబర్ 23న ఇండోర్ స్టేడియంలోని మాధవరావు సింధియా బ్లాక్ లో ఉన్న తన ఛాంబర్ కు షా పిలిచారని... అక్కడ తాను షా ఆశీస్సులు తీసుకోవడం కోసం అతని పాదాలను తాకానని... అప్పుడు అతను తనపై లైంగిక దాడికి ప్రయత్నించారని ఆరోపించింది. వెంటనే తాను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లోనే పనిచేస్తున్న తన తండ్రికి ఫిర్యాదు చేశానని తెలిపింది. అనంతరం ఆమె తండ్రి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో దీన్ని తేలిగ్గా తీసుకున్న ఎంపీసీఏ తర్వాత నలుగు వ్యక్తులతో కూడిన కమిటీని వేసింది. ఇందులో బీసీసీఐ మాజీ సెక్రెటరీ సంజయ్ జగ్దాలే కూడా ఉన్నారు. అయితే తానేమీ తప్పుచేయలేదని షా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News