: పెయిడ్ న్యూస్ పై ఈసీ నోటీసు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ఐదుగురు అభ్యర్థులకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు పంపింది. పత్రికలు, సామాజిక నెట్ వర్కింగ్ మీడియాల్లో వీరి ప్రచారానికి సంబంధించి చెల్లింపు వార్తలను ఈసీ గుర్తించింది. సర్దార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలో ఉన్న జయప్రకాశ్, మోతీ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సుశీల్ గుప్తా చెల్లింపు వార్తలకు సంబంధించి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరో ముగ్గురు అభ్యర్థులు సామాజిక మీడియాలో ప్రకటనలు ఇచ్చారని, వారు వాటిని ఉపసంహరించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అస్మిద్ జైన్ ఆదేశించారు.