: తరుణ్ తేజ్ పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్
విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల గడువు కోరిన 'తెహల్కా' మాజీ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ విజ్ఞప్తిని గోవా పోలీసులు నిరాకరించారు. వెంటనే అయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. ఈ సందర్భంగా గోవా పోలీసులు మాట్లాడుతూ.. తేజ్ పాల్ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. విచారణకు కోరిన సమయాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. అయితే, తేజ్ పాల్ కేసులో సమయం వృథా కాకుండా విచారణ చేపడతామన్నారు. మరోవైపు తెహల్కా ఫౌండేషన్ నుంచి సామాజిక కార్యకర్త అరుణా రాయ్ వైదొలగారు. ఈ మేరకు ఆమె రాజీనామా చేశారు.