: కిషన్ రెడ్డిపై కోర్టులో కేసు కొట్టివేత
హైదరాబాదు నాంపల్లి కోర్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేశారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఏసీ పిలుపునిచ్చిన సకలజనుల సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.