: జయసుధ రాజీనామా
సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి దంపతులకు ప్రాధాన్యం ఇస్తున్నారని కినుక వహించిన జయసుధ.. కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
ఈమేరకు రాజీనామా పత్రాన్ని ఆమె ముఖ్యమంత్రికి అందజేశారు. నిజాయతీపరులను కాదని అవినీతిపరులను అందలం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.