: ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎన్నికల ఫలితాలకు ఈసీ నిర్ణయం


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సాధ్యమైనంత వేగంగా ప్రజలకు తెలియజేసేందుకు, సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు ఓట్ల లెక్కంపు, పార్టీల ఆధిక్యత, అభ్యర్థుల ఆధిక్యత మొదలైన వివరాలన్నింటినీ... ఎప్పటికప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఉంచాలని నిర్ణయించింది. ఓట్ల లెక్కింపు వివరాలను ఈసీ తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలో పొందుపరచనుంది. ఈ ప్రయత్నం వల్ల ప్రజలకు మరింత వేగంగా సమాచారం అందుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News