: 150 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.. 3 మీటర్ల ఎత్తుకు అలలు లేస్తాయి
లెహర్ తుపాను తీరం తాకక ముందే బలహీన పడుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. తుపాను బలహీన పడినా నష్టం మాత్రం తప్పదని అంచనావేసింది. అనూహ్యంగా దిశలు మార్చుకుంటున్న లెహర్ తుపాను ఈ రాత్రికి బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. మచిలీపట్నం వద్ద రేపు సాయంత్రానికి లెహర్ తుపాను తీరం దాటనుందని, ఈ సందర్భంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 3 మీటర్ల ఎత్తుకు లేస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని ఓడ రేవుల్లోనూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.