: సిద్ధరామయ్య ఓ నియంత: యడ్యూరప్ప
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మాజీ సీఎం, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విరుచుకుపడ్డారు. సిద్ధరామయ్య ఓ నియంత అంటూ ఘాటైన పదజాలంలో విమర్శించారు. ఒంటెత్తు పోకడలతో ఆయన ఓ నియంతలా పరిపాలిస్తున్నారని అన్నారు. పథకాల అమల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఆయన తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంత పార్టీ అభిప్రాయాలను కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. కర్ణాటకలో ప్రవేశపెట్టిన షాదీ భాగ్య యోజన పథకాన్ని అన్ని వర్గాలకూ విస్తరించాలంటూ ఆయన బెల్గాంలో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు గుప్పించారు.