: ఏటీఎంల భద్రతపై బ్యాంకర్ల ప్రతినిధులతో అనురాగ్ శర్మ సమావేశం
హైదరాబాదులోని ఏటీఎంల వద్ద భద్రతపై హైదరాబాదులోని పలు బ్యాంకర్ల ప్రతినిధులతో నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ సమావేశం నిర్వహించారు. ఏటీఎంల వద్ద కచ్చితంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. బెంగళూరు ఏటీఎం ఘటనతో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమై ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. గతవారం బెంగళూరులోని ఓ ఏటీఎం సెంటర్ లో మహిళపై దుండగుడు తీవ్రంగా దాడిచేసిన సంగతి తెలిసిందే.