: గోదావరి జలాల కోసమే సీమాంధ్రులు భద్రాద్రి కోరుతున్నారు : నారాయణ


గోదావరి నదీ జలాల కోసమే సీమాంధ్రులు భద్రాద్రి కావాలంటున్నారని సీపీఐ కార్యదర్శి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులకు భద్రాద్రి రాముడిపై ప్రేమ లేదని, వారికి ఉన్నదంతా గోదావరి జిలాలపై మమకారమేనని, అందుకే భద్రాచలంను సీమాంధ్రలో కలపాలని కోరుతున్నారని అన్నారు. సీసీఐ (కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాలు దళారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయడం వ్యాపారుల ప్రయోజనం కోసమేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News