: లెహర్ వల్ల జేఎన్టీయూ కాకినాడ పరిధిలో పరీక్షలు వాయిదా
లెహర్ తుపాను కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలు, పెనునష్టం జరుగుతుందన్న అంచనాలతో జేఎన్టీయూ కాకినాడ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ రోజు రేపు జరగాల్సిన బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేశామని.. ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.