: రేపటి జీవోఎం సమావేశం చివరిదని చెప్పలేం: షిండే
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇప్పటికే రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, కీలక నేతలతో జీవోఎం భేటీ అయింది. ప్రస్తుతం బిల్లు ముసాయిదా తయారుచేసే పనిలో జీవోఎం తలమునకలైంది. ఈ రోజు కూడా కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జైపాల్ రెడ్డిలు షిండేతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు జీవోఎం పూర్తి స్థాయిలో సమావేశం కానుంది. అయితే, రేపు జరగనున్న జీవోఎం సమావేశం చివరి భేటీ కాకపోవచ్చని షిండే చెప్పడం కొసమెరుపు. ఇంకా చాలా అంశాలపై చర్చించాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనేదే తమ ఉద్దేశమని అన్నారు.