: వరద నష్టంపై ప్రధానిని కలిసిన బీజేపీ నేతలు
రెండు వరుస తుపానులతో రాష్ట్రంలోని రైతులు పూర్తిగా నష్టపోయారు. దీనిపై బీజేపీ బృందం ఈ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసింది. ప్రధానిని కలిసిన వారిలో వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఉన్నారు. భేటీ అనంతరం బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. అంతేకాకుండా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కు వెంటనే వెయ్యి కోట్లు చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు.