: హైదరాబాద్ పైనే తర్జనభర్జన... తలలు పట్టుకుంటున్న జీవోఎం సభ్యులు


రాష్ట్ర విభజన అంశం ఒక కొలిక్కి వచ్చినట్టు కన్పిస్తున్నా... కేంద్ర మంత్రుల బృందం మాత్రం హైదరాబాద్ పై తీవ్ర స్థాయిలో తర్జనభర్జన పడుతున్నారు. భాగ్యనగరాన్ని యూటీ చేయాలా? లేదా ఉమ్మడి రాజధాని చేయాలా? అనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఉమ్మడి రాజధానిగా చేస్తే... జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ పై పరిపాలనాపరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు సమాచారం. అయితే దాని విధివిధానాలు ఎలా ఉండాలన్న దానిపై జీవోఎం సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటి వరకు తయారైన నివేదికలో యూటీ అంశం లేదని తెలుస్తోంది.

అయితే రేపు ఉదయం 10 గంటలకు తనను కలవాలంటూ సీమాంద్ర కేంద్ర మంత్రులకు జైరాం రమేష్ నుంచి పిలుపు వచ్చింది. ఈ భేటీలో హైదరాబాద్ యూటీ అంశంపైనే చర్చించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ భవిష్యత్తుపై జీవోఎం కూడా ఇంకా ఎలాంటి తుది నిర్ణయానికి రాలేకపోయిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5 లోపు రాష్ట్రపతికి విభజన బిల్లు పంపాలనుకుంటున్న కేంద్రప్రభుత్వం... ఈ కొద్ది రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

  • Loading...

More Telugu News