: రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి: బైరెడ్డి
రాయలసీమలోనే సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తే తెలంగాణ ఏర్పాటు ఆగినట్టేనన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలిపారు. సీమ విచ్ఛిన్నమౌతుంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే మూడు రాష్టాలుగా విభజించాలని ఆయన డిమాండ్ చేశారు.