: ముంబై బయల్దేరిన జగన్


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముంబై బయల్దేరి వెళ్లారు. విభజనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు జాతీయ స్థాయి పార్టీల నేతలను కలుస్తున్న జగన్... శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల నేతలను కలువనున్నారు. విభజనపై ఏక పక్షంగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్న వైనాన్ని మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కు వివరించి, 3.30కి ఉద్ధవ్ ఠాక్రేకు తెలియజేస్తారు. జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా భేటీలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News