: సమన్యాయం జరగకపోతే అసెంబ్లీ, పార్లమెంటుల్లో బిల్లును వ్యతిరేకిస్తాం: చంద్రబాబు
విభజన నేపథ్యంలో, ఇరుప్రాంత ప్రజలకు సమన్యాయం జరగకపోతే అసెంబ్లీ, పార్లమెంటుల్లో రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాజమండ్రిలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేస్తామని చెప్పారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యంపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో పోరాడుతామని బాబు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓట్లు కావాలి తప్ప... ప్రజా సమస్యల పరిష్కారం అవసరం లేదని దుయ్యబట్టారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని అన్నారు.