: ఏటీఎం దాడి రాక్షసుడు సైకోనే: పోలీసులు


ఈ నెల 19న బెంగళూరులో ఏటీఎంలో జ్యోతి ఉదయ్ పై కత్తితో దాడి చేసిన దుర్మార్గుడు సైకో అని పోలీసులు తెలిపారు. వీడికిలాంటి నేరాలు కొత్త కాదని, వాడు ఇదివరకు ఇలాంటి దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 10న అనంతపురం జిల్లా ధర్మవరంలోని చంద్రబాబునగర్లో ప్రమీలమ్మ అనే మహిళపై దాడి చేసి 2 ఏటీఎం కార్డులు లాక్కున్నాడు. పిన్ నెంబర్లు తెలుసుకుని ఆమెను హత్య చేశాడు. ఆ రాత్రి కదిరి పారిపోయాడు. 11న అక్కడి స్టేట్ బ్యాంకు ఏటీఎం నుంచి ఓ కార్డు ద్వారా 4 వేల రూపాయలు డ్రా చేశాడు.

తరువాత బెంగళూరులో ఈ నెల 15న మరో ఏటీఎం కార్డు ద్వారా 18 వేల రూపాయలు డ్రాచేశాడు. కాగా, ప్రమీలమ్మ కుమారుడు ఆ రెండు ఏటీఎం కార్డులను బ్లాక్ చేయించాడు. దీంతో ఈ నెల 19 జ్యోతి ఉదయ్ పై దాడిచేసి ఏటీఎం కార్డు లాక్కున్నాడు. కదిరిలో డబ్బులు డ్రా చేసిన సమయంలోనూ, జ్యోతి ఉదయ్ పై దాడి సమయంలోనూ ఒకే రకమైన దుస్తులు ధరించినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది. పలు రకాల సమాచారం ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి వ్యవహార శైలి పరిశీలించిన పోలీసులు అతను సైకో అని అన్నారు.

  • Loading...

More Telugu News