: విభజన వల్ల సమస్యలు తగ్గవు, పెరుగుతాయి: సీఎం కిరణ్
రాష్ట్ర విభజన వల్ల సమస్యలు పరిష్కారం కావు సరికదా మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లా వి కోట రచ్చబండలో ఆయన మాట్లాడుతూ విభజన వల్ల పొరపాటు జరిగితే తెలుగుప్రజలు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశారు. విభజన వల్ల ఉద్యోగులు, ఫించను దారులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. రెండున్నర లక్షల మంది ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల సమస్య వస్తుందని అన్నారు. సాగు నీటి ఇబ్బందులు వస్తాయని, ప్రజల్లో ద్వేషభావం పెరుగుతుందని అన్నారు. తెలంగాణలో విద్యుదుత్పత్తి వినియోగం కంటే 50 శాతం తక్కువగా ఉందని అన్నారు. నీళ్లు, బొగ్గు, గ్యాస్ లేకపోతే సీమాంధ్రలో ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ప్రశ్నించారు.