: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో జగన్ భేటీ


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భువనేశ్వర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు సహకరించాలని కోరారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతున్న దాని గురించి నవీన్ పట్నాయక్ కు చెప్పానన్నారు. ఇది సరికాదని, ఇదే విధానం ఇతర రాష్ట్రాల విషయంలోనూ జరగవచ్చని చెప్పినట్లుగా వెల్లడించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, ఆర్టికల్ 3 సవరణకు సహకరించాని కోరినట్లుగా తెలిపారు. ఇందుకు ఆయన మద్దతు తెలిపారని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను జగన్ కలుస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News