: మూడు రోజుల్లో.. ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు.. !


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది! హైకోర్టులో మూడు రోజుల్లో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించనున్నారు. ఎలాగంటే, ఇప్పటివరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన పీసీ ఘోష్ ఈ రోజు సుప్రీం న్యాయమూర్తిగా వెళ్లిపోయారు. ఆయన గురువారం వరకు రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్లో ఉన్నారు.

ఆయన సుప్రీంకు వెళ్లడంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అందరిలోకీ సీనియర్ అయిన జస్టిస్ ఈశ్వరయ్యను నియమించారు. ఆయన రేపు పదవీ విరమణ చేయనుండడంతో ఈ ఒక్కరోజు మాత్రమే బాధ్యతల్లో కొనసాగుతారని తెలుస్తోంది. దీంతో, ఆ తర్వాత మరో సీనియర్ న్యాయమూర్తి అయిన ఎన్ వీ రమణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

కొత్త చీఫ్ జస్టిస్ ను నియమించే వరకు ఆయనే కొనసాగుతారు. అంటే, గురువారం ఘోష్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, శుక్రవారం ఈశ్వరయ్య, శని, ఆదివారాలు సెలవు కావడంతో సోమవారం నుంచి రమణ ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారన్నమాట. 

  • Loading...

More Telugu News