: యువతిని ఎత్తుకెళ్లి మూడు రోజులు సామూహిక అత్యాచారం
గుజరాత్ బనస్ కాంతా జిల్లాలోని కత్వా గ్రామ సమీపంలో ఓ 20 ఏళ్ల యువతిని ఇద్దరు కామాంధులు అటకాయించి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం మండల కేంద్రంలో పని చూసుకుని సట్మాల గ్రామంలోని తన ఇంటికి వెళ్తున్న 20 ఏళ్ల యువతిని గమనించిన కత్వా గ్రామానికి చెందిన విష్ణుజీ ఠాకూర్, హుక్కాజీ ఠాకూర్ లు మోటారు సైకిళ్లపై బలవంతంగా పొలాల్లోకి తీసుకువెళ్లి బంధించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కిడ్నాపర్ల చెరనుంచి శనివారం తప్పించుకున్న యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారిపై పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేసిన పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.