: పేదరికం రూపుమాపితే అధికారం పోతుందని కాంగ్రెస్ భయం: మోడీ
పేదరికాన్ని రూపుమాపితే అధికారం కోల్పోతామనే భయం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. మధ్యప్రదేశ్ మాండ్ సర్ లోని ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ పేదరికం అంతరించిపోవాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడూ కోరుకోలేదని మండిపడ్డారు. ప్రజలు చైతన్య వంతులైతే అధికారం కోల్పోతామని కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలు పరిపాలిస్తున్నా, దేశంలో పేదరికం పోయేందుకు చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చే ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీకి పేదరికం గుర్తుకు వస్తుందన్న మోడీ, బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.