: తెలంగాణ జిల్లాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు


తెలంగాణ జిల్లాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హెలెన్ తుపాను పూర్తిగా బలహీనపడి అల్పపీడనంగా తెలంగాణపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరో వైపు అండమాన్ వద్ద ఏర్పడిన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం చేరి రానున్న 24 గంటల్లో వాయుగుండంగానూ, మరో 72 గంటల్లో తుపానుగా మారనుందని ఐఎండీ అంచనా వేస్తొంది. ఇది ఈ నెల 27 లేక 28న తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

  • Loading...

More Telugu News