: ప్రముఖ తమిళ కవి జెయపాలన్ ను అరెస్ట్ చేసిన శ్రీలంక


ప్రముఖ తమిళ కవి జెయపాలన్ ను శ్రీలంక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. శ్రీలంకలోని జాఫ్నాలో జన్మించిన జెయపాలన్ నార్వేలో నివసిస్తున్నారు. ఆయనకు శ్రీలంకలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. టూరిస్ట్ వీసా మీద శ్రీలంకలో పర్యటిస్తున్న జెయపాలన్ వీసా నిబంధనలను అతిక్రమించారని శ్రీలంక పోలీసు అధికారులు పేర్కొన్నారు. జాఫ్నాలో నిబంధనలకు విరుద్ధంగా అతను సెమినార్లు నిర్వహిస్తున్నారని... దీంతో అక్కడ గత కొంత కాలంగా నెలకొన్న ప్రశాంత వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. జెయపాలన్ అనేక భారతీయ సినిమాలలో కూడా నటించారు. 'ఆడుకళం' అనే తమిళ సినిమాలో అతని నటనకు జాతీయ అవార్డు కూడా దక్కింది.

  • Loading...

More Telugu News