: 11 అంశాలపై జీవోఎంలోనే ఏకాభిప్రాయం లేదు: అశోక్ బాబు
రాష్ట్ర విభజనకు సంబంధించిన 11 అంశాలపై జీవోఎంలోని కేంద్ర మంత్రుల మధ్యే ఏకాభిప్రాయం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులతో రేపు సమావేశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అవసరమైతే మరోసారి నిరవధిక సమ్మెకు దిగేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలతో ఎదురయ్యే కష్టనష్టాలకు కూడా వెనక్కి తగ్గేది లేదని అశోక్ బాబు అన్నారు.